బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 2 సెప్టెంబరు 2017 (19:45 IST)

సిపిఎంతో కమల్ దోస్తీ - త్వరలో సీతారాం ఏచూరితో భేటి..

లెఫ్ట్ నేతలతో తనకున్న ప్రేమను చాటుకుని కేరళ సిఎం విజయ్‌ను కలిసిన నటుడు కమల్ హాసన్ వారిని కలిసి రాజకీయాల్లో నడిచేందుకు సిద్థమవుతున్నాడు. ఎంత అర్థరాత్రి అయినా సమస్య అంటూ కమ్యూనిస్టుల ఇళ్ళ తలుపులు తడితే వెంటనే స్పందించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసే ధైర

లెఫ్ట్ నేతలతో తనకున్న ప్రేమను చాటుకుని కేరళ సిఎం విజయ్‌ను కలిసిన నటుడు కమల్ హాసన్ వారిని కలిసి రాజకీయాల్లో నడిచేందుకు సిద్థమవుతున్నాడు. ఎంత అర్థరాత్రి అయినా సమస్య అంటూ కమ్యూనిస్టుల ఇళ్ళ తలుపులు తడితే వెంటనే స్పందించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఉండటంతో వారితో కలవాలని కమల్ నిర్ణయించేసుకున్నారట. అది కూడా సొంతంగా పార్టీ పెట్టి వారిని కలుపుకుని నడవాలన్నది కమల్ ఆలోచనట. 
 
కమ్యూనిస్టులు. సిపిఎం, సిపిఐగా విడిపోయారు. ఇందులో కాస్త పవర్‌ఫుల్ సిపిఎం. కేంద్రంలోను సీతారాం ఏచూరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తున్న వ్యక్తి. సిపిఎం నేతలు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పోరాటమంటే ముందుంటారు. సొంతంగా ఛానల్‌ను కూడా సమర్థవంతంగా నడిపేస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతలతో దగ్గరి సంబంధాలు సిపిఎం నేతలకు ఉంది. అందుకే వారితో కలవాలన్న నిర్ణయానికి వచ్చారు కమల్.
 
ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి పరువు పోగొట్టుకోవడం కంటే.. అవినీతి లేని సమాజ స్థాపన కోసం కమల్ లెఫ్ట్ నేతలతో కలిసేందుకు సిద్థమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చిన కమల్ ఇదే విషయాన్ని సిపిఎం నేత సీతారాం ఏచూరితో కలిసి చర్చించేందుకు సిద్థమవుతున్నారట. సీతారాం ఏచూరితో త్వరలోనే ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న కమల్ రాజకీయాల్లోకి వస్తే అవినీతి అనేది లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.