శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (16:06 IST)

పట్టాలు తప్పిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్.. ఎందుకో తెలుసా?

బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కున్నూరు బెంగుళూరుల మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం వేకువజామున 3.50 గంటల సమయంలో పట్టాలు తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో బెంగుళూరు డివిజన్‌ పరిధిలోని తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.