అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?
అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్న ఘటన తమిళనాడులోని కారైక్కుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారైక్కుడిలోని చెట్టినాడు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అయ్యప్పన్ (35). ఇతని భార్య పేరు కవిత.
ఈ దంపతులకు రెండు కుమారులున్నారు. మద్యానికి బానిసైన అయ్యప్పన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఉద్యోగం లేక ఇంట్లోనే వుంటున్నాడు.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కవిత తల్లి రంగమ్మాళ్ వున్నట్టుండి మృతి చెందింది. దీంతో అయ్యప్పన్ తన భార్యకు మద్దతుగా నిలిచిన అత్తమ్మ చనిపోయిందనే మనస్తాపంతో అల్లుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.