శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (17:54 IST)

చెరువులో హెచ్ఐవీ బాధితురాలి మృతదేహం.. నీటిని తోడేశారు..

హెచ్ఐవీ బాధితురాలు చెరువులో పడిందని, ఆమె మృతదేహాన్ని చేపలు తినేశాయి. ఆ నీరు కలుషితం అయిపోయానని గ్రామస్తులు ఒత్తిడి చేశారు. గ్రామస్తుల ఒత్తిడితో చెరువులోని నీటిని అధికారులు ఖాళీ చేయించిన ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో 23 ఎకరాల చెరువులోకి నీటిని తోడేశారు. 
 
ఇందుకు నవంబర్ 29న ఆ చెరువులో హెచ్‌ఐవీ సోకిన ఓ మహిళ (27) మృతదేహం తేలియాడటమే. అప్పటికే ఆమె శరీరాన్ని చేపలు సగం తినేశాయి. దీన్ని గమనించిన గ్రామస్తులు.. ఆ నీటిని వినియోగించేందుకు నిరాకరించారు. నీరు మొత్తం హెచ్ఐవీ వైరస్‌తో కలుషితం అయిపోయిందని.. భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి వచ్చి ల్యాబ్ టెస్టు కోసం నీటిని పంపుతామన్నారు. కానీ గ్రామస్తులు వినలేదు. నీటిలో హెచ్ఐవీ వుందని, ఆ నీటిని వినియోగించేది లేదన్నారు. 
 
దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు ఎనిమిది వాటర్ ట్యాంకులతో చెరువు వద్దకు చేరుకున్నారు చెరువు నీటిని నాలుగు మోటార్లతో 20 ట్యూబుల సాయంతో ఖాళీ చేయించారు. చెరువును నీటిని ఖాళీ చేయించామని.. చెరువును శుభ్రం చేసిన తర్వాత మాలాప్రభ కెనాల్ ద్వారా మళ్లీ నీటిని నింపుతామని స్థానిక తహసీల్దార్ చెప్పారు. 
 
గ్రామస్తుల భయానికి ఎలాంటి శాస్త్రీయత లేదని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ చెప్పారు. హెచ్ఐవీతో నీరు మొత్తం కలుషితమైందని భావించడం సబబు కాదని.. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు... నీటిలో ఎనిమిది గంటలకు మించి వైరస్ బతకదని స్పష్టం చేశారు.