Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'కర్ణాటక మోస్ట్ వాంటెడ్' ప్రధానికి రాహుల్ సవాల్: 5 నిమిషాలు మాట్లాడగలరా?

శనివారం, 5 మే 2018 (15:12 IST)

Widgets Magazine

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్- బీజేపీ నేతలకు మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ నేతలను ఏకిపారేస్తున్నారు. బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో పాటు కర్ణాటకలో గెలుపే లక్ష్యంగా ప్రజలకు వరాల జల్లు కురిస్తున్నారు. అయితే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ నేతలను పట్టించుకోకుండా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకున్నారు. 
 
ఇందులో భాగంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దాడిని తీవ్రతరం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తన ట్విట్టర్ పేజీలో ''కర్ణాటక మోస్ట్ వాంటెడ్'' పేరుతో ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మోదీకి రాహుల్ గాంధీ ఒక సవాల్ విసిరారు. 
 
కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ అవినీతి గురించి, పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల అవినీతి గురించి, రెడ్డి సోదరులకు ఎనిమిది టికెట్లు ఇవ్వడం గురించి కనీసం ఐదు నిమిషాలు మాట్లాడగలరా అంటూ సవాల్ చేశారు. పీఎమ్ మోదీజీ ఎంతో మాట్లాడతారు. కానీ సమస్యల్లా మీ చర్యలు మాటలకు సరిపోవు. యడ్డీపై అవినీతి చిట్టాను రాహుల్ గాంధీ ఈ వీడియో ద్వారా ప్రధాని ముందుంచి సవాల్ విసిరారు.
 
మరోవైపు కర్ణాటక రాష్ట్రం బాగుపడాలంటే.. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనంపై ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధిపై లేదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలని, ప్రజలను మభ్య పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంకా న్యాయం జరగలేదు.. ఓటు వేసే ప్రసక్తే లేదు: నిర్భయ తల్లిదండ్రులు

నిర్భయ కేసులో తీర్పు వచ్చినా.. ఇంకా న్యాయం మాత్రం జరగలేదని.. నిర్భయ తల్లిదండ్రులు ...

news

బద్ధలైన అగ్నిపర్వతం.. ఎగసిపడుతున్న లావా.. కుదేపిస్తున్న భూకంపం..

అమెరికా హవాయి ద్వీపంలోని అగ్నిపర్వతం బద్ధలైంది. దీంతో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప ...

news

చై.నా విడిపోయిందా? లేదా చైనా బ్యాచ్ విడిపోయిందా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలయిన శ్రీ చైతన్య, నారాయణ కొన్నాళ్ల క్రితం ‘చైనా’ ...

news

దాచేపల్లి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి.. రోజా బరితెగించిన మహిళ: యరపతినేని

దాచేపల్లి ఘటనపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రక్షణ ...

Widgets Magazine