Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా ఎమ్మెల్యే ఒక్కొక్కరికి భాజపా రూ.100 కోట్ల ఆఫర్... కుమారస్వామి ఆరోపణ

బుధవారం, 16 మే 2018 (13:54 IST)

Widgets Magazine

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని జేడీఎస్ లీడర్ కుమారస్వామి ఆరోపించారు. జేడీఎస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాము కర్నాటక అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
HD Kumaraswamy
 
మరోవైపు కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు కలుగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా నలుగురు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు వారిని వెతికేపనిలో పడ్డారు. 
 
మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే వున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 సీట్లు మాత్రమే కావలసి వుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి దూరంగా వున్న 12 మంది సభ్యులు భాజపా నాయకులతో టచ్ లోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు కంటి మీద కనుకు లేకుండా వుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

షాక్... 12 మంది కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్... కనబడటంలేదట...

కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ...

news

జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుంటే కర్నాటకలో కమలం వాడిపోయేదా?

కన్నడ పీఠం కోసం అన్ని పార్టీలు పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ ...

news

హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ ...

news

బీజేపీకి షాకిచ్చిన రేవణ్ణ.. కర్ణాటక సీఎం కుమారస్వామినే...

తనపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులకు మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు రేవణ్ణ తేరుకోలేని ...

Widgets Magazine