శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (17:34 IST)

ఆ మంత్రికి ముక్కూచెవులతో పాటు అన్నీ కోస్తాం : కర్ణిసేన హెచ్చరిక

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ రాష్ట్రంలో కేవలం ప్రజాప్రతినిధులే కాదు ఆ రాష్ట్ర మంత్రులు కూడా నోటికి పని చెపుతున్నారు. కర్ణిసేన వర్గం ప్రజలను ఆ రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖామంత్రి కిరణ్ మహేశ్వ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ రాష్ట్రంలో కేవలం ప్రజాప్రతినిధులే కాదు ఆ రాష్ట్ర మంత్రులు కూడా నోటికి పని చెపుతున్నారు. కర్ణిసేన వర్గం ప్రజలను ఆ రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖామంత్రి కిరణ్ మహేశ్వరి ఎలుకలతో పోల్చారు. దీనిపై కర్ణిసేన మండిపడింది. తమవర్గం ప్రజలకు మంత్రి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే ఆమె ముక్కూ చెవులు కోసేస్తామని హెచ్చరించింది.
 
రాజస్థాన్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్ రాజ్‌పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'ఇక్కడ కొంతమంది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తారు' అంటూ వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలపై ఆ వర్గం నేతలు మండిపడుతున్నారు. తక్షణం తమ వర్గం ప్రజలకు క్షమాపణలు చెప్పనిపక్షంలో మంత్రిని పట్టుకుని ముక్కూచెవులు కోసేస్తామంటూ హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన మంత్రి మహేశ్వరి మాటమార్చారు. కర్ణిసేన వర్గ ప్రజలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేశానని చెప్పారు. దీంతో, ఆమెకు మరో తలనొప్పి వచ్చి పడింది. మా పార్టీని విమర్శిస్తారా? అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.