Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత వీడియోతోనే దినకరన్‌కు గెలుపు.. డబ్బే గొప్పది: కేతిరెడ్డి

బుధవారం, 27 డిశెంబరు 2017 (11:15 IST)

Widgets Magazine

ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం శశికళ మేనల్లుడు దినకరన్‌కు కలిసొచ్చిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు.

లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తెరకెక్కించనున్న కేతిరెడ్డి ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆర్కే నగర్‌లో ఎక్కువగా నిరుపేద ఓటర్లు వున్నారు. వారికి భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దినకరన్ గెలుపుకు ఇదే కారణమని, రెండాకుల గుర్తు వచ్చిందనే ధీమాలో అన్నాడీఎంకే ఉండిపోయిందని... గుర్తు కంటే డబ్బే గొప్పది అనే విషయాన్ని వారు మరిచిపోయారని కేతిరెడ్డి చెప్పారు. 
 
తమిళనాడులో బీజేపీ వచ్చే ఛాన్స్ లేదని.. ఈ ఎన్నికల్లో తేలిపోయిందని చెప్పారు. దినకరన్ గెలుపుతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దినకరన్ విజయానికి, అన్నాడీఎంకే ఓటమికి తెలుగు ఓటర్లే కారణమని చెప్పారు. 

హీరో విశాల్ నామినేషన్‌ను అధికార అన్నాడీఎంకే నేతలు రద్దు చేయించారనే ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని అన్నారు. దినకరన్ గెలుపుకు కేవలం డబ్బు మాత్రమే కారణమని.. ఇప్పటి వరకు ఆర్కేనగర్‌కు ఏం చేశారో దినకరన్ చెప్పాలని డిమాండ్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గెలిచాక బుద్ధిచూపిన దినకరన్ ... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు

ఆర్కే.నగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ ...

news

పాకిస్థాన్ మీడియా ఓవరాక్షన్.. జాదవ్ తల్లిని అలా సంబోధించింది..

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ...

news

ప్రయాణికులకు చుక్కలు చూపుతున్న హైదరాబాద్ మెట్రో జర్నీ

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మెట్రో రైల్ జర్నీ పగటిపూట చుక్కలు చూపుతోంది. నిమిషాల్లో ...

news

టాంటాం చేసుకున్న మానవత్వం ఇదేనా? పాక్ తీరుపై భారత్ ధ్వజం

గూఢచర్య అరోపణలపై అరెస్ట్‌ చేసి, మరణశిక్ష విధించిన భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ ...

Widgets Magazine