Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడు కోరాడని ఫ్రెండ్స్ నగ్న ఫోటోలను పంపింది.. చివరికి ఆత్మహత్య చేసుకుంది...

గురువారం, 28 సెప్టెంబరు 2017 (15:55 IST)

Widgets Magazine
suicide

తన ప్రేమికుడు కోరాడని.. తన హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను అతనికి పంపిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తన ప్రియుడు కోరాడు కదా అని చెయ్యకూడని పని చేసిన ఆ యువతి.. ప్రియుడితోనే కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. థానే జిల్లా కల్యాణ్ పట్టణంలో హాస్టల్‌లో ఉంటూ, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతున్న 21 సంవత్సరాల వృశాలి లండే మేల్ నర్సుగా పని చేస్తున్న సురేశ్‌‌తో ప్రేమలో ఉంది. అయితే సురేశ్ తన ప్రియురాలిని ఓ కోరిక కోరాడు. అతని కోరిక మేరకు హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను తీసి సురేశ్‌‌కు పంపి సదరు యువతి పెద్ద తప్పు చేసింది. 
 
ఈ నేపథ్యంలో వృశాలీ సెల్ ఫోన్‌లో సురేష్‌తో జరిగిన చాటింగ్‌ను చూసిన ఓ హాస్టల్ రూమ్మేట్, మొత్తం విషయాన్నీ వెలుగులోకి తెచ్చింది. సురేష్‌ బలవంతం మేరకు ఆ పని చేశానని చెప్పడంతో కాగితంపై సురేష్‌ను కలవకూడదని.. కలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగితంపై దీన్ని రాసి తీసుకున్నారు. అయినా, సురేష్‌తో వృశాలి బంధం తెగలేదు. ఇదే విషయమై స్నేహితురాళ్లతో 23న గొడవ కూడా పడింది. 
 
ఆపై హాస్టల్ వదిలి వెళ్లిన వృశాలి సురేష్‌కు జరిగిందంతా చెప్పింది. తన స్నేహితులు ఎక్కడ కేసు పెడతారోనన్న భయంతో వృశాలి సురేష్  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృశాలి గది నుంచి ఆత్మహత్యకు దారితీసిన కారణాల లేఖను స్వాధీనం చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విమానం మిస్సైంది.. డ్యాన్స్ చేస్తూ టైమ్ ఎలా గడిపిందంటే? (వీడియో)

విమానం మిస్సైంది. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి ...

news

హోమాల పేరిట మహిళలను లొంగదీసుకునేవాడు.. టీవీల్లో జాతకం చెప్పే బాబా అరెస్ట్

దొంగబాబాల గుట్టు రట్టు అవుతుంది. ఇప్పటికే డేరా బాబా వంటి స్వామీజీల గుట్టు రట్టు అయ్యింది. ...

news

మతపెద్ద ముసుగులో మోసాలు.. 1000 పెళ్లిళ్లు.. అందమైన అమ్మాయిల్ని షేక్‌లకు?

దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి ...

news

మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. కాపురానికి రాలేదని ఏం చేశాడో వీడియోలో చూడండి

బాలికలపై దేశంలో దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కనిగిరి తరహా ఘటనలు ...

Widgets Magazine