మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (10:58 IST)

ట్రెండింగ్.. వరలక్ష్మికి మళ్లీ జయలలిత పేరేనా?

వరలక్ష్మి శరత్ కుమార్‌ను వివాదాలు వెన్నంటివున్నట్లున్నాయి. సర్కార్‌లో కోమలవల్లి అంటూ తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంకో పేరును పెట్టుకుని వివాదాన్ని కొనితెచ్చుకున్న వరలక్ష్మి... తాజాగా మారి-2లో నటిస్తోంది. ఈ సినిమాలోనూ వరలక్ష్మి క్యారెక్టర్ అమ్మ పేరునే పిలువబడుతోందని తెలుస్తోంది. 
 
ధనుష్ హీరోగా, ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న మారి-2లో సెక్రటరీ జనరల్‌గా వరలక్ష్మి కనిపించనుంది. ప్రస్తుతం ఈ రోల్‌ గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ రోల్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని వరలక్ష్మి పాత్రను యూనిట్ విడుదల చేసింది. ఈ క్యారెక్టర్ పేరు విజయ అంటూ యూనిట్ తెలిపింది. 
 
దీన్ని చూసిన నెటిజన్లు.. దివంగత సీఎం జయలలిత నిక్‌ నేమ్ విజయ అంటూ సెటైర్లు విసురుతున్నారు. సర్కార్ తరహాలోనే మారి-2 కూడా వివాదాన్ని కొనితెచ్చుకునేలా వుందని.. మళ్లీ జయలలిత నిక్‌ నేమ్‌ను వరలక్ష్మిని అంటగడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
ఈసారి అన్నాడీఎంకే కార్యకర్తలు ఏం చేస్తారో వేచి చూడాలని ఎద్దేవా చేస్తున్నారు. అన్నాడీఎంకే నేతలను టార్గెట్ చేస్తూ... వరలక్ష్మి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో వేచి చూడాలి.