మారి2 కోసం ఆటో డ్రైవర్ అవతారం.. ఆకట్టుకుంటుందా?

Last Updated: గురువారం, 8 నవంబరు 2018 (17:30 IST)
తెలుగులో ''ఫిదా''తో సూపర్ హిట్ కొట్టిన ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి.. తాజాగా శర్వానంద్ సరసన తెలుగులో 'పడి పడి లేచే మనసు' సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన 'మారి2' సినిమాలో నటిస్తోంది. గతంలో తమిళంలో వచ్చిన 'మారి' సినిమాకి సీక్వెల్‌గా దర్శకుడు బాలాజీ మోహన్ 'మారి 2' సినిమాను తెరకేక్కిస్తున్నాడు. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పక్కా మాస్ లుక్‌లో ఆటో డ్రైవర్ అవతారంలో సాయిపల్లవి కనిపిస్తోంది. ఇప్పటివరకు క్లాస్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ మాస్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మాస్ స్టెప్స్  వేస్తూ ఉన్న సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మారి2 కోసం సాయిపల్లవి ఆటో డ్రైవింగ్ నేర్చుకుందట. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం సినీ బృందం విడుదల చేసిన మారి2 స్టిల్స్‌కు భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. దీనిపై మరింత చదవండి :