మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 30 నవంబరు 2019 (19:52 IST)

16 కేసుల్లో నిందితుడితో పెళ్ళికి ఒప్పుకున్న మహిళా ఎస్సై, ఎందుకంటే?

ఒక మహిళా ఎస్.ఐ. ఒక కరుడు గట్టిన నిందితుడిని పట్టుకునేందుకు పెళ్లి నాటకం ఆడింది. ముందుగా ఆ నిందితుడిని ప్రేమలో దింపి తనవైపు తిప్పుకుని పెళ్లి చేసుకుందామని రమ్మని చెప్పి ఆ తరువాత కటాకటాల్లోకి నెట్టింది.
 
మధ్యప్రదేశ్ లోని ఛత్రాపూర్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బాలకిషన్ చౌబే అనే వ్యక్తిని మహిళా ఎస్ఐ చాకచక్యంగా పట్టుకుంది. యుపిలోని మహోబా జిల్లా బిజౌరీ ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుండడంతో అతడిపై పలు కేసులు పెట్టారు.
 
అయితే అతన్ని పట్టుకునేందుకు కష్టసాధ్యమవుతున్న తరుణంలో ఒక మహిళా ఎస్ఐ అతడికి తన పర్సనల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చింది. వెంటనే అతను ఆమెకు ఫోన్ చేశాడు. రాంగ్ కాల్ అని చెప్పినా అతను వినిపించుకోలేదు. అలా అతన్ని ప్రేమలో పడేసింది ఎస్ఐ. పెళ్లి చేసుకుందామని చెప్పి 15 రోజుల పాటు అతనితో స్నేహం పెంచుకుంది. ఆ తరువాత మెల్లగా అతన్ని బిజౌరీ గ్రామంలో ఉన్న ఆలయం వద్దకు రమ్మని చెప్పింది.
 
అప్పటికే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడు అక్కడికి రాగానే అరెస్టు చేశారు. కరుడుగట్టిన నిందితుడిని అరెస్ట్ చేయడంలో మహిళా ఎస్ఐ చూపిన చొరవను ఉన్నతాధికారులందరూ అభినందిస్తున్నారు.