ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

నదిలో బంగారం, వెండి నాణేలు.. పరుగులు తీసిన జనం

బంగారం, వెండి నాణేలు దొరుకుతున్నాయంటే.. ఆ ప్రాంతానికి జనాలు పరుగులు పెట్టరూ. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నదిలో నాణేల కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎనిమిది రోజుల క్రితం కొంతమంది మత్స్యకారులకు రాజ్‌ఘర్ జిల్లాలోని పార్వతి నదితో బంగారు, వెండి నాణేలు లభించాయి.
 
ఈ వార్త క్రమంగా అందరి చెవుల్లో పడిపోయింది. దీంతో రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. నీళ్లలోకి దిగి కొందరు బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతుకుతుండగా ఒడ్డునే ఉన్న బురద పెల్లలను తొలగిస్తూ మరి కొందరు ఆ నాణేల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.