సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (07:30 IST)

యువతికి మద్యం తాపించి బలాత్కారం చేశారు.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. మద్యం తాపించి మరీ నలుగురు కామాంధులు గ్యాగ్ రేప్ చేశారు. ఈ ఘటన శంధోల్ జిల్లా జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జైత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గడాఘాట్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. అంతకుముందు ఆమెను కారులో అపహరించారు. ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చి బలవంతంగా మద్యం తాగించారు. రాక్షసకాండ పూర్తయ్యాక ఈ నెల 20న ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. నలుగురు కామాంధులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్‌ త్రిపాఠీ అని తెలిసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు.