శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (11:43 IST)

కొడుకుపై అతిప్రేమతో కోడలిని చంపిన అత్త.. ఎక్కడ?

సాధారణంగా అత్తలను కోడళ్లు వేధిస్తుంటారు. ఈ తరహా వార్తలు ప్రతి రోజూ వింటున్నవే. కానీ, ఓ అత్త చేతిలో కోడలు హతమైంది. కోడలిని చంపింది.. వేధించినందుకు కాదు. కొడుకుపై ఉన్న అతి ప్రేమ కారణంగా ఆ తల్లి ఆ దారుణానికి పాల్పడింది. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర వసాయి అనే ప్రాంతానికి చెందిన ఆనంది మానె (48)కు కుమారుడు రోహన్ (33) ఉన్నాడు. ఈయనకు రియా (33) అనే యువతిని ఐదేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ క్రమంలో రియా నర్సింగ్ పూర్తిచేసివుండటంతో టెక్సాస్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో తన భర్తతో కలిసి ఆమె టెక్సాస్ వెళ్లిపోయింది. తన బిడ్డను తన నుంచి కోడలే దూరం చేసిందన్న కోపం ఆనంది మనసులో నాటుకుపోయింది. అప్పటి నుంచి ఆమెపై పగ పెంచుకుంది. 
 
అంతేకాకుడండా కోడలు నర్సింగ్ వృత్తిలో కొనసాగడం ఆనందికి ఏమాత్రం ఇష్టంలేదు. రియా అనే పేరు కూడా అత్తకు నచ్చలేదు. ఇదే విషయంపై వారిద్దరి మధ్యా చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. పేరు మార్చుకోవాలని, నర్సింగ్ వృత్తిని వదులుకోవాలని రియాకు ఆనంది చెప్పింది. కానీ, రియా పెడచెవిన పట్టింది. దీంతో ఆనందికి కోపం రెట్టింపయింది. 
 
ఈ నేపథ్యంలో రోహాన్ - రియా దంపతులు ఈ నెల ఒకటో తేదీన అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం తన కుమారుడు రోహన్ మార్నింగ్ వాక్‌కు వెళ్లగానే కోడలి గదిలోకి వెళ్లి పక్కనే ఉన్న ఫ్లవర్‌వాజ్‌తో ఆమె తలపై బలంగా మోదింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన పోలీసులు తీవ్ర రక్తస్రావంతో రియా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. 
 
పోలీసులు ఆనందిని అదుపులోకి తీసుకున్నారు. రియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కొడుకుపై పెంచుకున్న అమితమైన ప్రేమతో కోడలిని చంపేసిన ఆనంది.. మరో బిడ్డకు తల్లిని దూరం చేస్తున్నానన్న సంగతే మర్చిపోవడం గమనార్హం.