Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైతుల హెచ్చరికలతో మహా సర్కారుకు ముచ్చెమటలు.. రుణమాఫీకి ఓకే

సోమవారం, 12 జూన్ 2017 (11:10 IST)

Widgets Magazine
devendra fadnavis

రుణాలమాఫీ కోరుతూ సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించాయి. దీంతో రైతు రుణమాఫీని ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాలు జారీ చేశారు. చిన్న, మధ్యతరహా రైతులకు దీనివల్ల వెంటనే ప్రయోజనం చేకూరనుంది. 
 
వాస్తవానికి దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతుల వ్యయసాయ రుణమాఫీపై దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నాయి. అటు తమిళనాడు మొదలుకొని ఉత్తరాదివరకూ అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రుణ మాఫీ కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో రుణాల మాఫీ పేరుతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఇప్పడు పునరాలోచనలో పడ్డాయి. రుణమాఫీని అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మాఫీని ప్రకటించింది. చిన్న, మధ్యతరహా రైతులకు దీనివలన వెంటనే ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. సోమవారం నుండి రుణ మాఫీ అమలు కోసం నిరసనకు దిగుతామని ప్రకటించించిన రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. రైతు రుణమాఫీతో మహారాష్ట్ర ప్రభుత్వంపై రూ.30 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది. మొత్తానికి రైతులు విజయం సాధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నయీమ్ ఆయుధాలు బయటపడ్డాయ్.. పడకగదిలో తుపాకీ తూటాలు..

ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేపట్టిన ...

news

ఆ హంతకుడి పుర్రెను 176 యేళ్లుగా భద్రపరుస్తున్నారు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల శరీరాలు చెడిపోకుండా భద్రపరిచి వారిని ...

news

వడ్డీ వ్యాపారం పేరిట.. వేధింపులు.. బాకీ తీర్చు లేకుంటే.. కోరికైనా తీర్చమంటూ..

వడ్డీ వ్యాపారం పేరిట.. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యాపారిపై ఎట్టకేలకు కేసు ...

news

పెళ్లయి భార్య ఉండగానే.. మరో మహిళను పెళ్లాడి దొంగగా మారారు... ఎందుకని?

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లయి భార్య ఉండగానే.. చనువుగా ఉన్న మరో మహిళను ...

Widgets Magazine