నువ్వు ఏ గొట్టంగాడివి అయితే నాకేంటి : హీరోకు ఎమ్మెల్సీ వార్నింగ్ (వీడియో)

ఆదివారం, 12 నవంబరు 2017 (17:25 IST)

boat

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌పై మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు మండిపడ్డారు. నువ్వు సూపర్‌స్టార్‌వి అయితే నాకేంటి అంటూ నిలదీశారు. అంతేనా, అలీబాగ్ మొత్తాన్ని నువ్వు కొన్నావా? నా అనుమతి లేకుండా ఇక్కడ అడుగుపెట్టలేవు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 3వ తేదీన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. 
 
ఇంతకీ ఈ తరహా వార్నింగ్ ఇచ్చింది పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎమ్మెల్సీ జయంత్ పాటిల్. ముంబైలోని గేట్ ఆఫ్ ఇండియా జెట్టీ నుంచి అర్జెంట్‌గా అలీబాగ్‌కు వెళ్లేందుకు బోటు ఎక్కాడు. అయితే, ముందు బోటులో షారుక్‌ఖాన్ ఎక్కివున్నాడు. ఈ బోటు కదిలితేనే జయంత్ పాటిల్ బోటు కదలాల్సి ఉంది. 
 
కానీ, షారూక్ బోటు ఎంతకీ ముందుకు కదలకపోవడంతో పాటిల్ సహనం కోల్పోయారు. ఎంతకీ షారుక్ ఆ బోటు నుంచి బయటకు దిగకపోవడం, అది అక్కడి నుంచి కదలకపోవడంతో.. షారుక్‌పై పాటిల్ మండిపడ్డారు.
 
సూపర్‌స్టార్‌వి అయినంత మాత్రాన ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మండిపడ్డారు. పాటిల్ అలీబాగ్‌కే చెందినవారు కావడంతో.. తన అనుమతి లేకుండా ఇక్కడ అడుగుపెట్టలేవు అంటూ ఎంతో ఆవేశంతో షారుక్‌ను హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో జయంత్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. 
 
షారుక్ కోసం చాలా మంది అక్కడున్నారు. సెక్యూరిటీ ఉంది. చాలాసేపటి వరకు షారుక్ అక్కడి నుంచి కదల్లేదు. నేను అయినా వేచి చూశాను. పోలీసులు కూడా ఏమీ చేయలేదు అంటూ పాటిల్ వివరించారు. దీంతో షారుక్‌పై నోరు పారేసుకున్నట్టు అంగీకరించారు. 

 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పీవోకే పాకిస్థాన్ దే: నటుడు రిషి కపూర్ సంచలన ట్వీట్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌లో భూభాగమంటూ నిన్నటికి నిన్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ...

news

కెసిఆర్‌కు 70 ఎం.ఎం.సినిమా చూపిస్తా... రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి దూకుడును పెంచే ...

news

తిరుపతికి వచ్చి హిజ్రాలతో పెట్టుకుంటే.. చంపేస్తారంతే...

తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండులో ఒక వ్యక్తి దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ...

news

మహనీయుడి కడుపున పుట్టిన చీడపురుగు బాలక్రిష్ణ : వైసిపి ఎమ్మెల్యే

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నెల్లూరు సిటీ ...