బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (19:45 IST)

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. అయ్యప్పకు తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.

జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగిపోయింది. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.

పంబ నుంచి సన్నిధానం వరకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.