Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2 గంటల్లో కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఆరుగురిని చంపేశాడు.. ఎక్కడ?

మంగళవారం, 2 జనవరి 2018 (12:28 IST)

Widgets Magazine
haryana man

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని వ్యక్తి చేతిలో ఇనుపరాడ్డు పట్టుకుని కంటికి కనిపించిన వాళ్లను కనిపించినట్టు చంపేశాడు. అదీ కూడా కేవలం 2 గంటల్లో ఆరుగురిని చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ దండగుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశరాజధానికి 80 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రం, పాల్వాల్‌ అనే ఏరియాలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో రాడ్డు పట్టుకుని తిరుగుతూ కనిపించిన వాళ్లను కనిపించినట్లు హతమార్చాడు. ఇలా ఆరుగురుని చంపేశాడు. ఈ ఆరు హత్యలూ మంగళవారం రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ అధారంగా నిందితుడిని ఆదర్శ్‌నగర్‌ ప్రాంతంలో పట్టుకున్నారు. నీలం రంగు స్వెటర్, తెలుపు రంగు ప్యాంటు వేసుకుని ఆసుపత్రి ఆవరణలోకి వెళుతున్న దృశ్యాలు ఉదయం 2.30 గంటల సమయంలో రికార్డు అయ్యాయని, ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామన్నారు. 
 
దీనిపై పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిందితుడు మొదట ఆగ్రా రోడ్డు-మినార్ గేట్ మధ్యలో నలుగురిని హతమార్చాడని, ఆ తర్వాత ఒక సెక్యురిటీ గార్డును ఇనుపరాడ్డుతో కొట్టి ఆసుపత్రి వైపు వెళ్లాడని, అక్కడ ఓ మహిళపై దాడి చేశాడని చెప్పారు. అతడు దాడి చేసిన ఆరుగురూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా రాడ్డుతో దాడి చేసినట్టు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోడి పందేలు అలా వేసుకోండి... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ...

news

చంద్రబాబు - వై.ఎస్.జగన్ మధ్య రహస్య ఒప్పందమా?

ఏపీ రాజకీయాల్లో మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత ...

news

నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు శాపంగా మారారు: ముషారఫ్ ఆరోపణ

పాకిస్థాన్‌‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డామినేట్ చేస్తున్నారని పాక్ మాజీ ...

news

జనసేనకు చిరు సపోర్ట్ అవసరం... నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తన 50 యేళ్ళ జీవితంలో 20 యేళ్ళ పాటు స్తబ్దుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు ఆవేదనతో ...

Widgets Magazine