శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (16:19 IST)

వైఫ్ స్వాపింగ్‌కు ప్రపోజ్ చేసిన ఫ్రెండ్.. ఆ తర్వాత...

భార్యలను మార్చుకుందామంటూ పదేపదే ఒత్తిడి తెచ్చిన స్నేహితుడిని మరో ఫ్రెండ్ కడతేర్చాడు. ఈ దారుణం ముంబై సబర్బన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

భార్యలను మార్చుకుందామంటూ పదేపదే ఒత్తిడి తెచ్చిన స్నేహితుడిని మరో ఫ్రెండ్ కడతేర్చాడు. ఈ దారుణం ముంబై సబర్బన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగర శివారు ప్రాంతంలోని కందివలి ప్రాంతానికి చెందిన షారూఖ్ అన్సారీ, రయీస్ అన్సారీ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిద్దరూ వివాహితులు. అయితే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండటంతో తామిద్దరం భార్యలను మార్చుకుందామని రయీస్ అన్సారీ (వైఫ్ స్వాపింగ్) పదేపదే షారూఖ్ అన్సారీపై ఒత్తిడి చేస్తూ వచ్చాడు. 
 
వైఫ్ స్వాపింగ్ ప్రతిపాదన నచ్చని షారూఖ్ అన్సారీ ఆగ్రహంతో రయీస్ అన్సారీని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ రయీస్ తీరు మారలేదు. దీంతో ఆగ్రహించిన షారూఖ్.. రయీస్‌ను మల్వానీలోని అక్సా బీచ్‌కు తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. 
 
అక్సా బీచ్‌లో రయీస్ అన్సారీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు కేసు దర్యాప్తులో భార్యల మార్పిడి ప్రతిపాదన వెలుగుచూసింది. షారూఖ్ అన్సారీని అరెస్టు చేసిన పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.