శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (14:36 IST)

మామిడి పండును దొంగలించిన వ్యవహారం .. ఎంత పని చేశారో తెలుసా?

మామిడి పండును దొంగలించిన వ్యవహారంలో ఓ యువకుడిని కొట్టి చంపేసిన ఘటన తమిళనాడులోని మయిలాడుదురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయిలాడుదురైకి చెందిన కార్తీ అనే వ్యక్తి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుణశీలన్, మణివాసగన్ అనే యువకులు కార్తీతో వాగ్వివాదానికి దిగారు. 
 
మామిడి పండ్లను దొంగలించిన వ్యవహారంలో గుణశీలన్‌, మణివాసగన్‌లు కార్తీపై దాడి చేశారు. వీరిద్దరూ మామిడి పండ్లను దొంగలించారని.. కార్తీ వీరిద్దరిని తోట యజమానికి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో కార్తీపై గుణశీలన్, మణివాసగమ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్తీ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గుణశీలన్‌, మణివాసగన్‌‌ల కోసం గాలిస్తున్నారు.