మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (13:26 IST)

మావోయిస్టు కీలక నేత ఆర్కేను చుట్టుముట్టారా? భారీ ఎన్‌కౌంటర్?

మావోయిస్టు కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరుగుతు

మావోయిస్టు కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ దళాలకు ఆర్కే తారసపడినట్లు సమాచారం.
 
ఆర్కే బలిమెల రిజర్వాయర్ పరిధిలో వున్నట్లు పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టు నాయకుడు ఆర్కేతో పాటు మరో ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ఎదురుకాల్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ గ్రే హౌండ్స్‌ బలగాలు ఉన్నాయి. గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులు, చత్తీస్‌గఢ్‌లోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.