మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (17:13 IST)

భర్త చెప్పాడని ప్రియుడిని పక్కనబెట్టింది.. చిన్నారి బలైపోయింది.. ఎక్కడ?

క్షణికావేశం ఓ అభంశుభం తెలియని చిన్నారిని బలి తీసుకుంది. తల్లిచేసిన తప్పుకు ఓ చిన్నారి ప్రాణం బలైపోయింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ జిల్లాకు చెందిన అనుషా- కళ్యాణ్ దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వారిద్దరికి ఆద్య అనే ఆరేళ్ల కూతురు ఉంది. కొంతకాలం కిందట అనుషాకు కరుణాకర్‌ అనే మరో యువకుడితో ఏర్పడిన పరిచయం.. అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం అనుషా భర్తకు తెలియడంతో.. ప్రియుడిని అనుషా పక్కనబెట్టింది. దీంతో ప్రియురాలిపై తీవ్ర కోపం తెచ్చుకున్న ప్రియుడు అనుషా కూతురు ఆద్యను చంపాలని కుట్ర పన్నాడు. గురువారం మధ్యాహ్నాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి అనుషపై దాడికి యత్నించి వెంట తెచ్చుకున్న సర్జికల్ కత్తి ఆద్య గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో కొట్టుకుంటున్న పాపను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికి తీవ్ర రక్తస్రావం కావడం చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలను విడిచింది. నిందితుడు కరుణాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.