బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (11:27 IST)

దేవాలయం గంటకు వేలాడుతున్న యువతి శరీరం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి సంభవించింది. పట్టపగలు ఓ యువతి శరీరం ఆలయంలోని గంటలకు వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన ఆ ఆలయ పూజారి భీతిల్లిపోయి స్థానికలకు సమాచారం చేరవేశాడు. 
 
దీంతో గ్రామస్థులంతా అక్కడకు చేరుకుని షాక్ తిన్నారు. యువతి గొంతుపై కత్తి గాటు ఉండడం, ఆ తర్వాత గంటతో ఉరి వేసుకోవడంతో ఇది బలి వ్యవహారం అని నిర్ధారణకు వచ్చారు. ఇంతలో అక్కడకు చేరుకున్న యువతి బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యువతి శరీరాన్ని కిందకు దించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. 
 
అయితే ఈ బలి వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు కూడా గ్రామస్థులు ఇది బలి వ్యవహారమేనని చెప్పారు. మరణించిన యువతి, ఆమె తల్లి అమ్మవారిని బాగా నమ్మేవారని, ఈ క్రమంలోనే ఆమె ఏదో కోరిక కోసం తనను తాను బలిచ్చుకుని ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.