శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఢిల్లీలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్

సీరియళ్లు, సినిమాల ప్రభావమో ఏమో తెలియదుకానీ, ఆడ పిల్లల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకటో తరగతి చదివే ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది.

సీరియళ్లు, సినిమాల ప్రభావమో ఏమో తెలియదుకానీ, ఆడ పిల్లల మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకటో తరగతి చదివే ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. ఇంతలోనే దేశ రాజధాని ఢిల్లీలో 15 యేళ్ల మానసిక వికలాంగురాలిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
మాండవలీ ప్రాంతంలో ఇంటి బయట మాట్లాడుతున్న బాధితురాలికి భోజనం పెడతామని ఆశ చూపించి సమీపంలోని పార్క్‌లోకి తీసుకెళ్లాడో వ్యక్తి. అక్కడ అప్పటికే కాపుకాచివున్న మరో ఐదుగురు కలిసి బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఈ నెల 8న ఈ ఘటన జరిగినా... చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో డాక్టర్లు ప్రశ్నించడంతో బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. 
 
వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సామాజిక మాధ్యమంలో పరిచయమైన 17 ఏళ్ల బాలికను గెస్ట్‌ హౌజ్‌కు ఆహ్వానించిన 23 ఏళ్ల వ్యక్తి, ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు.