యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

శుక్రవారం, 24 నవంబరు 2017 (12:56 IST)

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు యజమానుల పట్ల రెట్టింపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ ఓ వానరం మాత్రం శునకాలకు మించిన విశ్వాసాన్ని ప్రకటించి యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణాలిచ్చింది. ఈ ఘటన కోల్‌కతాలోని కాశీపుర్ ప్రాంతంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో యజమాని ఇంటిలోకి చొరబడిన దొంగలపై వానరం దాడికి దిగింది. పావురాలను దొంగలించేందుకు వచ్చిన వారికి చుక్కలు చూపించింది. కాశీపూర్‌లో విక్కీ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో కొన్ని పావురాలతో పాటు ఈ వానరాన్ని కూడా పెంచుకుంటున్నాడు. 
 
కానీ పావురాలను దొంగలించేందుకు ఇంట్లోకి దొంగలు పడ్డారు. వీరిని గమనించిన వానరం వారితో పోటీపడి పావురాలను కాపాడింది. దీంతో వారు పావురాలను తీసుకెళ్లలేకపోయారు. కానీ వానరాన్ని మాత్రం దొంగలు చంపేశారు. దీంతో యజమాని కలతచెంది, ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?

పద్మావతి సినిమాపై వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ...

news

పరుపును మార్చినట్లు పురుషుల్ని మార్చేస్తారా?: రాజాసింగ్‌పై ఆ ఇద్దరు ఫైర్

సినీ పరిశ్రమలోని మహిళలందరూ మంచంపై పరుపును మార్చినట్టు పురుషులను మార్చేస్తారని ...

news

రాజకీయ ప్రవేశంపై పిచ్చెక్కించే ప్రశ్న వేసిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను పూర్తిగా మానుకున్నారు. ఇప్పటివరకు ...

news

విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం మరువలేనిది... చంద్రబాబు పొగడ్త

నల్లారి కుటుంబం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తెదేపాలో ...