గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 8 ఆగస్టు 2018 (08:49 IST)

ఇందిరా గాంధీకి హడలెత్తించిన కరుణానిధి... జాతీయ జెండా ఎగురవేసిన తొలి సీఎం

కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్

కరుణానిధి ఓ ధిక్కార స్వరం, హక్కుల కోసం పోరాడిన యోధుడు. జాతిని ఏకతాటిపై తెచ్చిన ఓ మహా నాయకుడు.. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ప్రాధాన్యం, హక్కల కోసం కరుణానిధి గట్టిగా పోరాడారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆకాంక్షించేవారు. 1974 సంవత్సరం వరకూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్లు మాత్రమే రాష్ట్రాల్లో జాతీయజెండా ఎగురవేసేవారు. 
 
ముఖ్యమంత్రలకు జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేది కాదు. దీనిని వ్యతిరేకించిన కరుణ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఘాటుగా ఓ లేఖ వ్రాసారు. దీనికి ప్రతి స్పందించిన రాష్ట్రాల్లో ఆగష్టు 15న ముఖ్యమంత్రులు, జనవరి 26న గవర్నర్లు జెండా ఎగురవేయాలని కేంద్రం ప్రకటించింది. దీంతో 1974 ఆగష్టు 15న ముఖ్యమంత్రిగా జెండా ఎగురవేశారు కరుణానిధి. 
 
అలా జాతీయ జెండా ఎగుర వేసిన తొలిముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రులకు జాతీయ జెండా ఎగురవేసే హక్కును సాధించిన యోధుడుగా కరుణానిధి చరిత్రలో నిలబడ్డారు. అంతేకాదు ఆయన తమిళనాడు కోసం ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు.