Widgets Magazine

తిరుమలలో అరుదైన దృశ్యం.. ఆ రెండు రోజుల్లో గరుడ సేవ.. ఎప్పుడు?

సోమవారం, 6 ఆగస్టు 2018 (11:35 IST)

శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో స్పష్టం చేశారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశారు. ఇక శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని ఈవో తేల్చి చెప్పేశారు. ఇకపోతే.. శ్రీవారు కొలువైన తిరుమలలో ఈ నెలలో ఈ నెలలో ఓ అరుదైన దృశ్యం సాక్షాత్కారం కానుంది. 
 
ఒకే నెలలో స్వామివారు తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై రెండుసార్లు విహరించనున్నారు. ఈ నెల 16న గరుడ పంచమికాగా, ఆపై 26న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుడు తిరు మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగనున్నారు. 
 
గరుడ పంచమి నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల మధ్య, ఆపై శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య గరుడవాహన సేవను నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెలలో జరిగే రెండు గరుడ సేవలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానుండటంతో వారి సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
తిరుమల గరుడ సేవ శ్రీవారు బ్రహ్మోత్సవాలు తిరుపతి Tirumala Garuda Seva Sravana Pournima Garuda Panchami Two Times Sri Venkateswara Swamy

Loading comments ...

భవిష్యవాణి

news

సోమవారం (06-08-2018) రాశిఫలాలు : చేసే పనుల్లో ఏకాగ్రత ముఖ్యం...

మేషం: వైద్యులు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల ...

news

ఆదివారం (05-08-18) రాశిఫలాలు - మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా...

మేషం: స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధిమవుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల ...

news

5-08-2018 నుండి 11-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రవి, వక్రి బుధ, రాహువులు, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, ...

news

శనివారం ఇలా చేస్తే.. రాహు, కేతు దోషాలు తొలగిపోతాయి..

శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించినవారికి శని, రాహువు, కేతు గ్రహ దోషాలు ...

Widgets Magazine