శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (11:29 IST)

'సుఖ' సంసారం పగటి పూటే ఎందుకు చేయాలి?

భార్యాభర్తల మధ్య సుఖసంసారం కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలని వాత్సాయన మహర్షితో పాటు శృంగార నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. భార్యాభర్తలు లేదా స్త్రీపురుషులు తమ ఏకాంత జీవితాన్ని కేవలం రాత

భార్యాభర్తల మధ్య సుఖసంసారం కేవలం రాత్రిపూట మాత్రమే చేయాలని వాత్సాయన మహర్షితో పాటు శృంగార నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. భార్యాభర్తలు లేదా స్త్రీపురుషులు తమ ఏకాంత జీవితాన్ని కేవలం రాత్రి పూట అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చట.  పైగా, శారీరకంగా కలుసుకునేందుకు పగటిపూట ఏమాత్రం అనువైన వేళ కాదని అంటున్నారు.
 
శృంగారానికి పగటి పూట కంటే రాత్రి వేళ ఉత్తమమైనదిగా చెపుతున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు రతి కార్యంలో నిమగ్నమైవున్న సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు. ఒకసారి శృంగారనికి ఉపక్రమిస్తే అది నిర్విఘ్నంగా పూర్తి చేయాలనే కోరిక పురుషుడు లేదా స్త్రీలలో బలంగా ఉంటుందట. అపుడే భార్యాభర్తలిద్దరూ లైంగిక సంతృప్తిని పొందుతారట. 
 
ఈ కార్యం పగటిపూట పెట్టుకుంటే ఏదో ఒకవిధంగా ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అదే రాత్రి వేళల్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అందుకే రాత్రి వేళలే అత్యుత్తమైనవిగా శృంగార నిపుణులు చెపుతున్నారు. అదేసమయంలో రాత్రి భోజనం పూర్తయిన వెంటనే ఈ తంతుకు పూనుకోరాదని సలహా ఇస్తున్నారు.