శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (15:23 IST)

ఓఎన్జీసీ హెలికాప్టర్ గల్లంతు.. నలుగురి మృతదేహాల వెలికితీత

ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ముంబై సమీపంలో సముద్రంలోకి వెళ్లిన ఈ విమానం అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్న

ముంబైలోని జుహు నుంచి టేకాఫ్ అయిన ఓఎన్జీసీకి చెందిన ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ముంబై సమీపంలో సముద్రంలోకి వెళ్లిన ఈ విమానం అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్నారు. 
 
పవన్ హాన్స్‌‌కు చెందిన ఈ హెలికాప్టర్ ఉదయం 10.20 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయ్యింది. నింగికెగిరిన 15 నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. ముంబై హై నార్త్ ఫీల్డ్‌కు వెళ్తున్న సమయంలో ఇది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
 
ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయిన వెంటనే కోస్ట్ గార్డ్స్‌ను అప్రమత్తం చేశారని.. ఈ విమానం గల్లంతుపై గాలింపు కార్యక్రమాలు జరుపుతున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నార్త్ ఫీల్డ్‌లో ఉదయం 10.58 గంటలకు చాపర్ ల్యాండ్ కావాల్సింది. 
 
అయితే హెలికాఫ్టర్ గల్లంతు కావడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ హెలికాప్టర్ నీట మునిగిందని, ఇప్పటిదాకా నలుగురి మృతదేహాలను కోస్ట్ గార్డ్ సహాయక సిబ్బంది వెలికి తీశారు. మరో ఇద్దరి మృత దేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.