లోదుస్తులు విప్పీ దాన్ని చూపించాడు... కానిస్టేబుల్ కుమార్తె పట్ల ఖాకీ అసభ్య ప్రవర్తన

arrest
Last Updated: బుధవారం, 15 మే 2019 (09:25 IST)
సహోద్యోగి కుమార్తె పట్ల కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ ఖాకీ అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించాడు. తన ఇంటి బాల్కనీ నిల్చొని లోదుస్తులన్నీ విప్పి.. తన మర్మాంగాన్ని సహోద్యోగి కుమార్తెకు చూపించాడు. ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలో పంత్ నగర్‍లో హరీష్ చంద్ర లహానే (41) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉండగా, పోలీస్ క్వార్టర్స్‌లో కేటాయించిన ఇంటిలో నివశిస్తున్నాడు. అయితే, పక్క క్వార్టర్స్‌లో పోలీస్ ఉన్నతాధికారి కుటుంబం నివాసం ఉంటుంది. ఈయనకు 22 యేళ్ళ కుమార్తె కూడా ఉంది.

ఆమెపై కన్నేసిన లహానీ.. ఆ యువతి బాల్కనీలోకి వచ్చినపుడల్లా సైగలు చేయడం, ముద్దులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో బాధిత యువతి తన ఇంటిలోని బాల్కనీలో నిల్చుని తమ బంధువుతో ఫోనులో మాట్లాడుతుండగా లహానే తన బాల్కనీ నుంచి ఆమెకు అసభ్యంగా సైగలు చేశాడు.

అంతటితో ఆగని లహానే.. లోదుస్తులన్నీ విప్పి... మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత యువతి ఇంటిలోకి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి నెహ్రూనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు లహానేను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :