మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (18:51 IST)

సిద్ధరామయ్యకి రెండు పెళ్లిళ్లు, చాలదని పాత విద్యార్థినితో కామకలాపాలు

కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న పాడు పని వల్ల సమాజంలో గురువుకి వున్న గౌరవం తగ్గిపోతోంది. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థినీవిద్యార్థులను ఉన్నతస్థాయి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది గురువులే. అలాంటి వారిలో కొందరు పక్కదోవ పడుతున్నారు. తమ వద్దకు చదువుకునేందుకు వస్తున్న విద్యార్థునుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా కొందరిని లొంగదీసుకుని తమ వాంఛలు తీర్చుకుంటున్నారు. 
 
తాజాగా కర్నాటకలోని మైసూరులో ఓ ఉపాధ్యాయుడు చేసిన పాడు పని వల్ల విద్యార్థిని జీవితంతో ఆడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్లో సిద్ధరామయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆల్రెడీ రెండు పెళ్లిళ్లయ్యాయి. ఐతే తన వద్ద చదువుకున్న 20 ఏళ్ల విద్యార్థినిపై అతడి చూపు పడింది. దీనితో ఆమెను మభ్య పెట్టి శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
ఆ సమయంలో ఆమెతో ఏకాంతంగా గడిపిన సన్నివేశాలు, ఫోటోలు తీసుకుని వాటిని యువతి వాట్సప్‌కు పంపిస్తుండేవాడు. ఇలా పంపే క్రమంలో అవి మరో వ్యక్తికి వెళ్లడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీటిని చూసిన యువతి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. గ్రామస్తులతో కలిసి అతడిని పట్టుకునేందుకు వెళ్లగా అంతకుముందే విషయం తెలుసుకుని పారిపోయాడు. దీనితో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.