హాస్పిటల్ సిబ్బందిని కొట్టిన నసిరుద్దీన్ షా కూతురు

nazaruddin shah daughter
ఎం| Last Updated: శనివారం, 25 జనవరి 2020 (22:21 IST)
వెటర్నరీ హాస్పిటల్ సిబ్బందిని కొట్టింది యాక్టర్ నసిరుద్దీన్ షా కూతురు హీబా షా. దీంతో ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 16వతేదీన ముంబైలోని ఓ వెటర్నరీ హాస్పిటల్ కు తన పెంపుడు పిల్లులకు వైద్యం చేయించడానికి తీసుకెళ్లింది. అప్పటికే వైద్యులు వేరే పిల్లులకు ఆపరేషన్ చేస్తున్నందున హీబాను ఐదు నిమిషాలు వేయిట్ చేయమన్నారు.

మూడు నిమిషాలు అయిన తర్వాత అసహనానికి గురైనా హీబా షా… నేనెవరో తెలుసా మీకు .. నన్నే వెయిట్ చేయమంటారా అని హాస్పిటల్ వాళ్లతో కొట్లాడింది. దీంతో పాటు ఇద్దరు నర్స్ లను కొట్టింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనపై హీబా పటేల్ ను మీడియా ప్రశ్నించగా.. అవును నేను హాస్పిటల్ సిబ్బందిని కొట్టాను. అయితే వాళ్లే నాపై అమర్యాదగా ప్రవర్తించారు.

నేను క్యాబ్ నుంచి దిగగానే నాపిల్లులను హాస్పిటల్ సిబ్బంది లోపలికి తీసుకెళ్లడానికి సహాయం చేయలేదు. పైగా నన్ను గేట్ దగ్గరే సెక్యురిటీ ఆపి చాలా సేపు ప్రశ్నించాడు. లోపల కూడా నన్ను వెయిట్ చేయించారు.

అందుకే హాస్పిటల్ సిబ్బందితో కొట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో… సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు హీబా పై ఐపీసీ సెక్షన్ 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు.దీనిపై మరింత చదవండి :