Widgets Magazine

ఆవు, పంది మాంసం తినే నెహ్రూను పండిట్ అంటారా?: అహూజా

శనివారం, 11 ఆగస్టు 2018 (11:10 IST)

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమని.. లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థులే కారణమని కూడా అహూజా ఆరోపించారు. 
 
తాజాగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆవు, పంది మాసం తినే నెహ్రూ అసలు పండిటే కాదని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.
 
కేవలం ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పార్టీ ముందు పండిట్ అనే పదాన్ని చేర్చిందని అహుజా విమర్శలు గుప్పించారు. అహూజా వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమై వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటన.. ఏఐసీసీ అధ్యక్ష హోదాలో?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌లలో ...

news

ఈడీ కేసులో నా భార్య ముద్దాయి.. ఆ వార్తల్ని చూసి షాకయ్యా: జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ...

news

ఆయన పేరుకే ఎక్సైజ్ ఎస్.ఐ... ఆస్తులు 50 కోట్లు...

చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా ...

news

మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో చొరపడుతున్న 1947 నెంబర్... అదేం చేస్తుందంటే?

అకస్మాత్తుగా మీకు తెలియకుండానే మీ ఫోనులోకి ఓ నెంబర్ వచ్చి చేరిపోంది. దాని ద్వారా ...

Widgets Magazine