Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

గురువారం, 25 జనవరి 2018 (15:39 IST)

Widgets Magazine
national flag

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర రాజ్యంగాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ నిర్మాణం జరిగింది.
 
అలాంటి రాజ్యాంగ అసలు ప్రతులు ప్రస్తుతం కేవలం రెండంటే రెండే ఉన్నాయి. వీటిలో ఒకటి హిందీలో ఉండగా, మరొకటి ఆంగ్లంలో ఉంది. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌ కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచివున్నారు. వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. 
 
అయితే, జనవరి 26నే ఎందుకు అమల్లోకి తెచ్చారు? అనే అంశాన్ని పరిశీలిస్తే, బ్రిటీష్ పాలనలోనే అంటే 1929, డిసెంబర్ 19వ తేదీన చారిత్రాత్మక భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగింది. ఇందులో పూర్ణ స్వరాజ్ కోసం పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత లాహోర్ వేదికగా జరిగిన సమావేశంలో మహాత్మా గాంధీ 1929 డిసెంబర్ 31వ తేదీన మూడు రంగుల భారత జెండాను ఎగురవేశారు. 
 
ఆ సమావేశంలోనే 1930 జనవరి 26వ నుంచే సంపూర్ణ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి భారత కాంగ్రెస్ ఓ తీర్మానం చేసింది. ఆ మేరకు అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆ రోజును సగర్వంగా పూర్ణస్వరాజ్‌గా జరుపుకోవడానికి ఏకతాటిపైకి వచ్చారు. అందుకే ఆ రోజును పురస్కరించుకుని రాజ్యాంగాన్ని జనవరి 26వ తేదీనే అమల్లోకి తెచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Celebrate India January 26 Parliament Br Ambedkar Jawaharlal Nehru Republic Day

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే ...

news

ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)

చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో ...

news

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని ...

news

పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా ...

Widgets Magazine