శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (21:19 IST)

'భాగమతి' కోసం కేర‌ళ ప్రమోష‌న్‌లో అనుష్క‌(Video)

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్‌తో స‌హా అన్ని ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో అనుష్క న‌ట‌విశ్వ‌ర

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్‌తో స‌హా అన్ని ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో అనుష్క న‌ట‌విశ్వ‌రూపం చూపించే డైలాగ్ ఎవ‌డు పడితే వాడు రావడానికి ... ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా.... లెక్కలు తేలాలి... ఒక్కడ్ని పోనివ్వను... విప‌రీతంగా వైర‌ల్ కావ‌టం విశేషం. అలాగే మందారా మందారా... కరిగే తెల్లారేలా అంటూ సాగే పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.
 
అనుష్క, ఉన్ని ముకుందన్ మీద చిత్రీకరించిన ఈ ప్లెజెంట్ సాంగ్‌కు యూత్ ఫిదా అవుతున్నారు. అశోక్ దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశి, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌత్ ఇండియాలో మొత్తంగా అన్ని భాష‌ల్లో జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా చెన్నైలో ఆడియో రిలీజ్, హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కేర‌ళలో కూడా ప్ర‌మోష‌న్‌ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. కేర‌ళ ప్ర‌మోష‌న్స్‌కి నిర్మాత‌లు ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లు, ద‌ర్శ‌కుడు అశోక్‌, హీరోయిన్ అనుష్క‌, ఉన్ని ముకుంద‌న్‌లు హాజ‌ర‌య్యారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రం త‌రువాత అనుష్క న‌టించిన చిత్రం మా భాగ‌మ‌తి. ఇప్ప‌టికే విప‌రీతమైన క్రేజ్ వున్న ఈ చిత్రం అంద‌రి అంచ‌నాల‌కు అందుకునేలా వుంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేవ‌సేనగా అభిమాన ధ‌నాన్ని సంపాదించుకున్న అనుష్క న‌టించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో 10 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం ఈచిత్రం పై ప్రేక్ష‌కుల అంచ‌నాలు తెలుస్తుంది. అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి. 
 
ఇది ఏ ఓక్క భాష‌కి సంబంధించిన క‌థ కాదు. యూనివ‌ర్స‌ల్ స‌బ్జ‌క్ట్‌. త‌ప్ప‌కుండా ఏ భాష‌లో అయినా హ్య‌మ‌న్‌ ఎమోష‌న్ ఒక్క‌టే కాబ‌ట్టి ఈ చిత్రాన్ని సౌత్ ఇండియా మొత్తం అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ప్రమోషన్లో భాగంగా కేర‌ళకి వ‌చ్చాము. కేర‌ళలో అనుష్క చాలా పెద్ద ఫ్యాన్ బ్యాంక్ వుంది. అదేవిధంగా ఉన్ని ముకుంద‌న్ లాంటి మ‌ళ‌యాల స్టార్ కూడా న‌టించారు. ఇంకా చాలామంది మ‌ళ‌యాల న‌టీన‌టులు న‌టించ‌టంతో కేర‌ళ సినిమా ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని హృద‌యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకున్నారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అన్ని భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని మా న‌మ్మ‌కం అని అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు అశోక్ మాట్లాడుతూ.. నా కెరీర్లో ఇంత పెద్ద అవ‌కాశాన్ని అందించిన నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌ల‌కి నా హృద‌య‌పూర్వక ధ‌న్య‌వాదాలు.. వీరిని నేను త్రిమూర్తులు అంటుంటాను. అయితే నాకు ఇంత శ‌క్తిని అందించింది మాత్రం అనుష్క. ఈ చిత్రానికి ప్రాంతం, భాష లేదు.. హ్యూమ‌న్‌ ఎమోష‌న్ మాత్ర‌మే వుంది. ప్ర‌తి ఒక్క‌రు అన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తారు. త‌ప్ప‌కుండా స‌ర్‌ప్రైజ్ అవుతారు. భాగ‌మ‌తి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ మ‌రియు సాంకేతిక నిపుణులు అంద‌రూ ఈ చిత్రంలో పాత్ర‌ల్లా చేశారు. మేము వేసిన బంగ్లా సెట్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే థ‌మ‌న్ రీ-రికార్డింగ్, మాట‌లు, ఎఫెక్ట్స్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఇలా ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడ్ని ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.
 
హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ.. నాకు ఇలాంటి ఓ మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన యువి క్రియెష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్‌లకు నా థ్యాంక్స్‌. నా పెయిర్‌గా న‌టించిన ఉన్ని ముకుంద‌న్‌కి నా థ్యాంక్స్‌. న‌న్ను ఇంత బాగా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ధి థ్యాంక్స్‌. కేర‌ళకి ప్ర‌మోష‌న్‌కి రావ‌టం చాలా హ్య‌పీగా వుంది. అందరికీ ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. అలాగే ద‌ర్శ‌కుడు అశోక్ చాలా బాగా నేరేట్ చేశారు, అదే రేంజిలో తీసారు. ఆర్ట్ ర‌వింద‌ర్ వ‌ర్క్ ఈచిత్రంలో చాలా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. జ‌న‌వరి 26న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది అని అన్నారు.
 
నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్, సంగీతం - ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రాఫర్ - మథి, పిఆర్ఓ- ఏలూరు శ్రీను, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, నిర్మాతలు - వంశీ - ప్రమోద్-విక్ర‌మ్‌, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్.