సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (16:26 IST)

నవ వధువు అంబులెన్స్‌లోనే కన్నుమూసింది.. బెడ్ దొరకకపోవడంతో..?

కరోనా కారణంగా నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే…ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్‌ లోనే కన్నుమూసింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది.
 
స్వర్ణలత (25) భువనేశ్వర్ ప్రాంతంలో బల్లిపట్నా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవలే విష్ణుతో వివాహమైంది. అయితే..స్వర్ణలత జ్వరం రావడంతో..మందులు వేసుకున్నారు. జ్వరం తగ్గలేదు కదా..మరింత ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఆమె కుటుంబసభ్యులు బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
 
ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని కటక్ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. చివరకు అక్కడకు వెళితే..ఇక్కడ కాదు..భువనేశ్వర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
 
తీరా అక్కడకు వెళ్లిన తర్వాత..కోవిడ్ రిపోర్టు ఉంటే చేర్చుకుంటామని సెలవిచ్చారు. అంబులెన్స్ లోనే స్వర్ణలత అష్టకష్టాలు పడింది. తర్వాత..ఎయిమ్స్.. ఇలా 9 ఆసుపత్రులు తిరిగారు.
 
కానీ..ఎక్కడా స్వర్ణలతను చేర్చుకోలేదు. దీంతో కుటుంబీకులు మళ్లీ బల్లిపట్నా పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకు రాలేదు. చేసేది ఏమీ లేక.. భువనేశ్వర్ వెళుతుండగా..మార్గమధ్యలో అంబులెన్స్ లోనే ఇక సెలవ్ అంటూ.. తుదిశ్వాస విడిచింది స్వర్ణలత.