మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (09:34 IST)

రేప్‌కు మరణదండన... బిల్లుపెట్టనున్న కేంద్రం

ఇకపై 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని ఉరితీసేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో కేం

ఇకపై 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారిని ఉరితీసేలా కేంద్ర ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో కేంద్ర హోం శాఖ రూపొందించిన ముసాయిదా బిల్లుకు అమోదముద్ర కూడా వేశారు. తాజా ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాక, దాన్ని రాష్ట్రపతికి పంపించి చట్టంగా రూపొందించనున్నారు. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే...
 
*  12 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికపై రేప్ చేసి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణదండన. 
* మహిళలపై అత్యాచారానికి పాల్పడితే కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష  లేదా జీవిత ఖైదుగా పొడిగించవచ్చు.
* 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారం చేస్తే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. 
 
* అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేస్తారు. అప్పీళ్లను 6 నెలల్లో పరిష్కరిస్తారు.
* 16 ఏళ్ల లోపు బాలికపై రేప్, సామూహిక అత్యాచారం జరిపిన నిందితులకు బెయిల్ మంజూరిపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే 15 రోజుల ముందే బాధితురాలి తరపు లాయర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. ఇలాంటి అనేక నిబంధనలను ముసాయిదా బిల్లులో పొందుపరిచారు.