శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (19:16 IST)

పొదల మాటున ఆ పని కుదరదు-ఆ పార్కుకు వస్తే అది తప్పనిసరి

నగరాల్లోని పబ్లిక్ పార్కుల్లో ప్రేమజంటలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పార్కులకు వచ్చే ప్రేమ జంటలు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు మీడియా వెలుగులోకి తెచ్చిన దాఖలాలున్నాయి. అయితే తాజాగా పార్కుల్లో జంటలు చేసే అ

నగరాల్లోని పబ్లిక్ పార్కుల్లో ప్రేమజంటలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పార్కులకు వచ్చే ప్రేమ జంటలు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు మీడియా వెలుగులోకి తెచ్చిన దాఖలాలున్నాయి. అయితే తాజాగా పార్కుల్లో జంటలు చేసే అకృత్యాలకు అడ్డువేసే దిశగా కోయంబత్తూరు పార్కు కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చింది.

కోయంబ‌త్తూర్‌లోని అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ బొటానిక‌ల్ గార్డెన్స్‌కు వచ్చే జంటలు క‌చ్చితంగా వివాహ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల‌ని నిబంధనను ప్రవేశపెట్టారు. 
 
పొద‌ల మాటున కొన్ని జంట‌లు చేసే చర్యలతో ఫిర్యాదులు అందడంతోనే ఈ నిబంధన పెట్టినట్లు పార్కు నిర్వ‌హణాధికారులు వెల్లడించారు. పార్కులో సర్టిఫికేట్ లేకుండా, చూపించకుండా తిరిగే జంటలపై పోలీసు కేసు నమోదు చేస్తామని నిర్వహణాధికారులు తెలిపారు. ఈ నిబంధ‌న కార‌ణంగా పార్కుకి హాజ‌ర‌య్యే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయిన‌ట్లు స‌మాచారం. 
 
ఆధార్, వివాహ ధ్రువీకరణ పత్రం లేకుండా జంటలు ఈ పార్కుకు వచ్చే అవకాశం లేదని చెప్పడంతో స్థానికులు కొందరు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని.. వివాహమైనా ధ్రువీకరణ పత్రాలు తీసుకోని వారు ఏం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కోవై పార్కు నిర్వహణాధికారులు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోమని తేల్చి చెప్తున్నారు.