మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (20:58 IST)

ఓబుళాపురం మైనింగ్‌ కేసు: ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి మూడేళ్ల జైలుశిక్ష

court
అక్రమార్కులను ఓబుళాపురం మైనింగ్‌ కేసు పదేళ్ల క్రితం దేశంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సంచలన తీర్పిచ్చింది రాయదుర్గం కోర్టు.
 
ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఓబుళాపురం గనుల్లో తనిఖీలకు వచ్చిన అధికారులను అడ్డుకున్న కేసులో ఈ జడ్జిమెంట్‌ ఇచ్చింది రాయదుర్గం సివిల్‌ కోర్టు. 
 
2008లో అటవీ అధికారులు పోలీసులకు కంప్లైంట్‌ చేయడంతో ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదుచేసి ఛార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో ఎంతోమంది సాక్షులను విచారించింది కోర్టు. 
 
దాదాపు పద్నాలుగేళ్ల విచారణ తర్వాత, ఓఎంసీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చిన రాయదుర్గం సివిల్‌ కోర్టు, మూడేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.