శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:22 IST)

హర్యానా మాజీ సీఎం చౌతాలా ఆస్తులు జప్తు

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. గత 1993 -2006 మధ్య కాలంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ విచారణలో 6.09 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించినట్టు తేలింది. దీంతో ఢిల్లీ, పంచకుల, సిర్సా ప్రాంతాల్లో ఉన్న చౌతాలా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 
 
వీటి విలువ రూ.3.68 కోట్లని ఈడీ తెలిపింది. చౌతాలాతోపాటు మరికొందరిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపింది. కాగా, మనీలాండరింగ్ కేసులో చౌతాలాతోపాటు ఆయన కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.