శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (10:04 IST)

70వ గణతంత్ర దినోత్సవం... 14మందికి పద్మ భూషణ్, 94మందికి పద్మశ్రీ

దేశ 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలురంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి కేంద్రం అత్యున్నత పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా 14మందికి పద్మ  భూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.
 
పలు రంగాల్లో విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), అస్సామీ జానపద గాయకుడు భూపేన్ హజారికా (మరణానంతరం)లకు అత్యున్నత భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించింది.
 
అలాగే పద్మవిభూషణ్ అవార్డును టీజెన్‌బాయ్ , అనిల్ కుమార్, మణీబాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, బల్వంత మోరేశ్వర్ పురంధేరలను ఎంపికయ్యారు.