శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:36 IST)

ఫేస్‌బుక్ మోసం.. ఎస్ఐ అవతారం ఎత్తాడు.. అమ్మాయిగా మారాడు.. చివరికి?

ఫేస్‌బుక్ మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఎస్ఐ నంటూ ఫేస్‌బుక్ ద్వారా మోసాలకు పాల్పడిన వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అమ్మాయినని చెప్పి యువకులతో చాటింగ్ చేసేవాడు. యువకుల మొబైల్ నెంబర్లను తీసుకుని వాయిస్ చేంజర్ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ.. వ్యక్తిగత వివరాలు సేకరించి వారిని ట్రాప్ చేసేవాడు. చివరికి డబ్బులు వసూలు చేస్తూ దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, హుబ్లీ నగరానికి చెందిన సిద్ధప్ప.. ఫేస్‌బుక్‌లో భవిక అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేశాడు. అమ్మాయినని చెప్పి తొలుత ప్రేమ పేరుతో వల వేసేవాడు. కానీ కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు చేస్తాననంటూ.. వారిని డబ్బులు గుంజేవాడు. ప్రేమ పేరుతో భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందని.. విచారణ కోసం వచ్చానని ఎస్‌ఐ వెళ్లి అబ్బాయిలను బెదిరించేవాడు. ఆపై కొంతమొత్తం ఇస్తే ఈ కేసు నుంచి తప్పిస్తానని డబ్బులు తీసుకునే వాడు. ఇలా భారీగా డబ్బులు గుంజిన సిద్దప్ప వ్యవహారం శక్తినగర్‌కు చెందిన ఓ ఇంటి వద్ద బయటపడింది. 
 
శక్తినగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో ఆమె కుమారుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఎస్ఐ వేషంలో శారదమ్మ ఇంటికొచ్చి ఆమె కుమారుడు ఎఫ్‌బీలో ఓ యువతిని మోసం చేశాడని.. చెప్పాడు. దీంతో శారదమ్మ, ఆమె భర్త నారాయణ గౌడ్ కంగారుపడ్డారు. కొడుకు ఏదో తప్పు చేశాడని సిద్దప్పను ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా ఈ కేసు నుంచి తప్పించాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంతమొత్తం లేదని, రూ.5 వేలున్నాయని శారదమ్మ చేతిలో పెట్టింది. 
 
కానీ మొత్తం ఇవ్వాలని సిద్దప్ప డిమాండ్‌ చేయడంతో తెచ్చిస్తానంటూ శారదమ్మ భర్త నారాయణగౌడ్‌ బయటకు వెళ్లాడు. మొదటి నుంచి సిద్దప్ప ప్రవర్తన మీద అనుమానం ఉన్న అతను ఉదయ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ జైకీర్తి హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రశ్నించగా తాను ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐని అంటూ తొలుత సిద్దప్ప బుకాయించాడు. దీంతో సిద్ధప్ప వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం సిద్దప్ప జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.