సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:17 IST)

గులాబీ రేకులు మెత్తగా పొడి చేసి...?

ఎటువంటివారికైనా చలికాలంలో చర్మం పగలటం, పొట్టులా తెలుపురంగులో ఉండడం జరుగుతుంది. అలా ఉండకుండా మృదువుగా, అందంగా ఉండాలంటే ఇంట్లోని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సహజ సౌందర్యంతో శరీరం మెరిసిపోతుంది. మరి అవేంటో తెలుసుకుందాం...
 
1. బాగా ఎండబెట్టిన తులసి ఆకులు, పెసరపప్పు, గులాబీ రేకులు మెత్తగా పొడిచేసి ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిమ్మరసంతో కలిపి స్నానం చేసేముందు శరీరానికి రుద్దుకుంటే ఫలితం ఉంటుంది.
 
2. వీలైనన్ని సార్లు మీ ముఖం, చేతులు, మెడను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. క్రీమ్స్ బజారులోనివి వాడవద్దు. పెరుగు, నిమ్మరసం, శెనగపిండి కలిపిన మిశ్రమం వాడండి చాలు.
 
3. మేకప్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మూయిశ్చరైజర్, నరిషింగ్ ఆల్‌పర్‌పస్ మసాజ్ క్రీమ్స్ వాడండి. జలుబు, దగ్గు ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 
 
4. రోజుకు రెండు ముల్లంగి దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే మీ శరీర కాంతి పెరుగుతుంది. రాత్రి నిద్రపోయేముందు నెయ్యిని ముఖానికి బాగా మర్దన చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం మంచి రంగు వచ్చి.. నునుపుదనంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
 
5. మెంతులు బాగానూరి ముఖానికి మర్దన చేసుకుని, గంట తరువాత స్నానం చేస్తే ముఖం చాలా మృదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి పాదాలు శుభ్రంగా ఉంటాయి.