అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదాన : ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్
గత 2020 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం పద్మ అవార్డులు ఇస్తుండగా.. ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా అవార్డు దక్కింది.
పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు) ఉన్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు అవార్డు అందుకున్నారు. అలాగే, స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.