Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంగారంపై ఆశ.. కుమార్తెను చంపి కళ్ళెదుటే అత్యాచారం.. గుడ్లప్పగించి చూసిన తల్లిదండ్రులు...

శనివారం, 10 జూన్ 2017 (17:36 IST)

Widgets Magazine

బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి జిల్లాలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ జిల్లాకు చెందిన మహావీర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి బంగారు వ్యాపారం చేస్తూ నష్టాలు రావడంతో ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడు. విషయం తెలిసిన కృష్ణ శర్మ అనే మంత్రగాడు తాను చెప్పినట్లు చేస్తే 5 కేజీల బంగారం దొరుకుతుందని ప్రసాద్‌ దంపతులను నమ్మించాడు. 
 
ఇందుకోసం 15 యేళ్ళ వయసున్న ప్రసాద్ కుమార్తె కవితతో త్యాగం పూజ చేయించాల్సి ఉంటుందని చెప్పడంతో ప్రసాద్ దంపతులు సమ్మతించారు. ఆ తర్వాత కవితకు మత్తు కలిపిన జలాన్ని మంత్రగాడు తాపించాడు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ఎదుటే మంత్రగాడు ఆ యువతిని వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఆమె శవాన్ని పొలాల్లో పడేసే ముందు కూడా మరోమారు తల్లిదండ్రుల ఎదుటే అత్యాచారం జరిపాడు. బంగారం దొరక్కపోవడంతో తాము మోసపోయినట్టు గ్రహించిన ప్రసాద్ మంత్రగాడు కృష్ణ శర్మపై మహావీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంవెలుగు చూసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భద్రాచలం రామాలయం ఆంధ్రాకు దక్కాలి : బీజేపీ నేత సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం ...

news

ఆ ముగ్గురూ మూడు కోతులు.. జగన్‌కు ఓవరాక్షన్ చేయడం తప్ప మరేమీ తెలియదు!

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ...

news

ప్రపంచ వినాశనకారి డోనాల్డ్ ట్రంప్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు

ప్రపంచాన్ని నాశనం చేసే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనని ఉత్తర కొరియా ...

news

గో మూత్రం తాగేవారిని కాల్చిపారేయండి : ఐసిస్ హుకుం

దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని జిహాదీలు హ‌త‌మార్చాల‌ని ఇస్లామిక్ స్టేట్ ...

Widgets Magazine