శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (19:04 IST)

లేటు వయసులో ఆరో బిడ్డ.. హేళన చేశారని గొంతుకోసి చంపేశారు..?

పశ్చిమ బెంగాల్‌లో పక్కింటివారు నవ్వారని.. హేళనగా మాట్లాడారని కన్నబిడ్డనే కడతేర్చారు తల్లిదండ్రులు. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిలీప్‌ చక్ర

కేరళలో మొన్నటికి మొన్న నాలుగో బిడ్డ పుట్టిందని.. పక్కింటివారు హేళన చేస్తున్నారనే కారణంతో ఆ బిడ్డను చర్చి వద్ద వదిలిపెట్టిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బిడ్డను చర్చి వద్ద తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్లిన తతంగమంతా సీసీటీవీలో రికార్డు కావడంతో.. వారిని సులభంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై బిడ్డను వారికి అప్పగించారు. 
 
అయితే పశ్చిమ బెంగాల్‌లో పక్కింటివారు నవ్వారని.. హేళనగా మాట్లాడారని కన్నబిడ్డనే కడతేర్చారు తల్లిదండ్రులు. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిలీప్‌ చక్రవర్తి (47), సునీత(42) కూచ్‌ బిహార్‌ జిల్లాకు చెందిన వారు. వారు రోజూవారీ కూలీలు. వారికి ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. కొన్ని రోజులు క్రితం ఈ దంపతులకు ఆడ శిశువు కలిగింది. 
 
లేటు వయసులో ఆరో బిడ్డకు జన్మనివ్వడంతో కొందరు వారిని హేళన చేశారు. దాన్ని అవమానంగా భావించిన దిలీప్‌ దంపతులు వారం రోజులు కూడా లేని ఆ పసిబిడ్డను గొంతుకోసి కడతేర్చారు. సోమవారం చిన్నారి మృతదేహాన్ని కాసిర్ దంగా గ్రామంలోని చెరువు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అమ్మాయి పుట్టడం వల్ల ఇలా చేశారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.