మూడు దశాబ్దాలుగా పెండింగ్ : మహిళా బిల్లుకు త్వరలో మోక్షం??
గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుకు త్వరలోనే మోక్షం లభించనున్నారు. సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లుకు మోక్షం లభించేలా కేంద్రంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఈ నెల 20వ తేదీ బుధవారం ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించవచ్చని భావిస్తున్నారు.
ఇదే జరిగితే గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్టే. ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అనేక రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెడితే ఈ బిల్లును ఆమోదిస్తూ అన్ని పార్టీలు మద్దతిచ్చి పాస్ చేసేందుకు పూర్తి అకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత 17వ లోక్‌సభలో 15 శాతం కంటే దిగువన మహిళా ఎంపీలు ఉన్నారు. 2022లో రాజ్యసభలో 28.3 శాతం మహిళలు ఉన్నారు. 1952లో లోక్‌సభలో మహిళా ఎంపీలు 4.4 శాతం, రాజ్యసభలో 2 శాతంగా ఉండేవారు. దేశ జనాభాలో దాదాపు సగం మేరకు మహిళలు ఉన్నారు. దీంతో వీరికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.