శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (06:46 IST)

జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడ

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జీఎస్టీ రేట్లు తగ్గింపుపై లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని గుర్తించారని, కొన్ని సవరణలను చేయాలని ఆయన సూచించారని చెప్పారు. 
 
ఫలితంగానే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కారణంగా 178 వస్తువులపై వసూలు చేస్తూ వచ్చిన 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో వర్తకులు, వ్యాపారులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 
 
కాగా, ఇటీవల గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ తగ్గింపు క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొనడం గమనార్హం.