శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (09:28 IST)

రైతులకు అధిక ఆదాయం.. రాజకీయ ప్రయోజనాలు మాకొద్దు: మోదీ

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం మో

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. అన్నారు.  లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు దేశాన్ని అనుకూల ప్రాంతంగా మార్చినట్టు మోదీ పదాంగ్రస్టు ప్రసంగంలో వెల్లడించారు. 
 
ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ముందడుగు వేసినట్టు ప్రధాని పేర్కొన్నారు. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇంటింటికి మరుగుదొడ్డిని నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశామని మోదీ గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని అందరూ అడుగుతున్నారని, కానీ తాము మాత్రం రైతు పెడుతున్న పెట్టుబడిలో ఒకటిన్నర రెట్లు అధికంగా ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు.
 
ప్రతీ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న తమ లక్ష్యం సాకారమవుతోందని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేసి చూపించామన్నారు. కోట్లాదిమంది చిన్న వ్యాపారుల సహకారంతో జీఎస్టీ విజయవంతం అయిందని కొనియాడారు. దివాలా బిల్లు, బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పడుతున్నట్టు మోదీ పేర్కొన్నారు. తాము దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తామే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని మోదీ తేల్చి చెప్పారు.